అద్భుత దేవుడవు - ఆశ్చర్యకరుడవు
పల్లవి: అద్భుత దేవుడవు - ఆశ్చర్యకరుడవుఅనాధనైన నన్ను నీ- సేవకు పిలిచావుఅ.ప. యేసయ్యా... నా యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా...1. అమ్మ కడుపులో పిండమునై యుండగా నన్ను ఏర్పరిచావునాన్న ఎలా ఉంటాడో - చూడలేని నన్ను చూచావుఊహకు అందదు నీ ఉద్దేశము నా యెడల నీ సంకల్పం ॥అద్భుత॥2. మురికి గుంటలో నుండి నన్ను గగనంలోకి నడిపావుఘనులతో నన్ను కూర్చోబెట్టి ఘనతను నాకు నిచ్చావులెక్కించలేనయ్యా మేలులూ- వర్ణించలేను నీ మహిమలు ॥అద్భుత॥3. ఎన్నికలేని నన్ను నీవు - ఎన్నిక చేసుకొన్నావుఅల్పుడనైనా నన్ను నీ - పరిశుద్ధులలో చేర్చావుఏమివ్వగలను నీ ప్రేమకు సమర్పింతును నా జీవితం ||అద్భుత॥- రచన, స్వరకల్పన: పాస్టర్ టి.క్రిష్టాఫర్
No comments:
Post a Comment