విధేయత- విజయం
పల్లవి: విధేయత- విజయం - వినయం - జీవం...
అవిధేయత - అపజయం - మరణం శాపం
విధేయత - నా కియ్యుమా!
నీలాంటి మనస్సు - నా కియ్యుమా !
నీవలె తగ్గింపు నా కొసగుమా!
యేసయ్యా - యేసయ్యా - నా యేసయ్యా
1.అబ్రహాము నీతికి - వారసుడనై
మోషే బడిలో - బాలుడనై
యోబు వంటి - శుద్ధతతో ...
ఆలస్యం చేయక - వెనువెంటనే
లోబడే జీవితం - నాకియ్యుమా...(2) ॥యేసయ్యా॥
2.గిద్యోను లోబడి - ఓడించెను...
యెహోషువా ప్రార్థించి - జయమొందెను
దావీదులాంటి - సుబుద్ధితో
నోవాహు వంటి - నమ్మకంతో... (2)
సందేహము లేక - సమర్పణతో
సంపూర్ణ విధేయత - నాకియ్యుమా ! ॥యేసయ్యా॥
3.అపోస్తలుల బోధకు - లోబడుదును
పరవశించి పాడే - ఆత్మతో నింపు
ఆగని హోరులో - ఆరని దీపముగా
ప్రజ్వలింప జేయుము - నీ రాకకై
మెలుకువలో ప్రార్థించే - కృపనియ్యుమా
నీ రాకకై నన్ను - సిద్ధపరచుమా ॥యేసయ్యా॥