Saturday, November 29, 2025

Sarvashakti Mantuda song lyrics

సర్వశక్తిమంతుడా - సర్వోన్నతుడా



పల్లవి: సర్వశక్తిమంతుడా - సర్వోన్నతుడా సన్నుతించెదను నా యేసయ్యా స్వరమెత్తి పాడెదను యేసయ్యా యేసయ్యా (4)

1. కష్టమే వచ్చినా - నష్టమే కల్గినా... నీవు నాకుండగా నా... యేసయ్యా... 
భయము లేదుగా... (2)     "సర్వశక్తి

2. వ్యాధులే వచ్చినా - బాధలే కల్గినా... స్వస్థపరచితివి నా యేసయ్యా... 
శాంతినిచ్చితివి... (2)          "సర్వశక్తి

3. నిందలే వచ్చినా - అవమానం కల్గినా ఆదరించితివి నా యేసయ్యా... 
ఆదుకొంటివి... (2)              "సర్వశక్తి

                                                      రచన, స్వరకల్పన: సిస్టర్ దయామణి క్రిష్టోఫర్



 

Adbhuta Devudavu Song Lyrics

AFC MINISTRY
                                            అద్భుత దేవుడవు - ఆశ్చర్యకరుడవు



పల్లవి: అద్భుత దేవుడవు - ఆశ్చర్యకరుడవు
 అనాధనైన నన్ను నీ- సేవకు పిలిచావు

అ.ప. యేసయ్యా... నా యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా...

1. అమ్మ కడుపులో పిండమునై యుండగా నన్ను ఏర్పరిచావు 
    నాన్న ఎలా ఉంటాడో - చూడలేని నన్ను చూచావు
    ఊహకు అందదు నీ ఉద్దేశము నా యెడల నీ సంకల్పం        ॥అద్భుత॥

2. మురికి గుంటలో నుండి నన్ను గగనంలోకి నడిపావు 
    ఘనులతో నన్ను కూర్చోబెట్టి ఘనతను నాకు నిచ్చావు 
    లెక్కించలేనయ్యా మేలులూ- వర్ణించలేను నీ మహిమలు     ॥అద్భుత॥

3. ఎన్నికలేని నన్ను నీవు - ఎన్నిక చేసుకొన్నావు 
    అల్పుడనైనా నన్ను నీ - పరిశుద్ధులలో చేర్చావు
    ఏమివ్వగలను నీ ప్రేమకు సమర్పింతును నా జీవితం          ||అద్భుత॥

                                                                            - రచన, స్వరకల్పన: పాస్టర్ టి.క్రిష్టాఫర్


Krupa Maya Yeasaya song lyrics

కృపమయా యేసయ్యా కృపమయా యేసయ్యా నీ కృపా లేనిదే నే బ్రతుకలేనయ్యా కృపమయా యేసయ్యా నీ కృపా లేనిదే నే బ్రతుకలేనయ్యా కృపా వెంబడి కృపతో నన్ను నింపుమా...