రాజులరాజు ప్రభువుల ప్రభువు
పల్లవి: రాజులరాజు ప్రభువుల ప్రభువు రానైయున్నాడు
నా యేసు - రానైయున్నాడు
అ.ప. మహిమ స్వరూపుడై - తేజోమయుడై
మహిమ స్వరూపుడై - మేఘారూఢుడై
1. అల్పయు ఓమేఘయు - ఆది అంతము లేనివాడు
మహిమ స్వరూపుడై - తేజోమయుడై
రానైయున్నాడు - నా యేసు ॥మహి॥
2. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ॥మహి॥
3. పదివేలలో - అతిసుందరుడు
అతికాంక్షనీయుడు - ఆరాధ్యదైవం ॥మహి॥
4. యేసుని నమ్మిన వధువు సంఘమును
కొనిపోవుటకై వచ్చుచున్నాడు ॥మహి॥
\
Raju- రచన, స్వరకల్పన: సిస్టర్ దయామణి క్రిప్టాఫర్
No comments:
Post a Comment