Friday, December 5, 2025

Yatrikudanu Nenu Prabhuva song lyrics

యాత్రికుడను నేను ప్రభువా


పల్లవి: యాత్రికుడను నేను ప్రభువా - ఈ లోక మార్గమునా (2) 
       ఐగుప్తును విడచి కానాను పురమునకు నన్ను చేర్చుమా (2)॥యా॥

1. మార్గమున ఎన్ని కష్టములొచ్చిననూ - ఆహారం లేకుండినను (2) 
   మరుగైన మన్నాను - నాకిచ్చి నీవు
    తృప్తిపరచి - తోడై నడిపించుమా (2)  ॥యాత్రికుడ

2. నా జీవిత యాత్రలో నాయకుడవై నీవుండి - నన్ను నడిపించుమా (2) 
   నా చేయి విడువక - వెనువెంట వుండి 
   పరమ కానాన్ నన్ను చేర్చుమా (2)   "యాత్రికుడ

3. ఈ జీవిత పయనంలో పలుత్రోవలైనా- నేను భయపడను (2) 
   పగలు మేఘస్తంభమై - రాత్రి అగ్నిస్తంభమై 
   నాకు తోడై - నన్ను నడిపించుమా   "యాత్రికుడ॥

                                                                                                    - రచన, స్వరకల్పన: పాస్టర్ టి. కిష్టాఫర్

No comments:

Post a Comment

Ascharya karyamulu song lyrics

2026 NEW YEAR SONG  ఆశ్చర్య కార్యములు - జరిగించువాడా!.. న్యూ  సాంగ్ పల్లవి: ఆశ్చర్య కార్యములు - జరిగించువాడా!.. అద్భుత దేవుడవు - నీవేనయ్యా!....