ఆనందమే ... ఆనందమే ...
యేసయ్యలో - నిత్య ఆనందమే...
అ.ప. ప్రభుయేసు నాతో ఉండగా భయమేల నా కిలలో ...
ఆ..హల్లేలూయ...ఆ...హల్లెలూయా (3)
1. ఎన్ని కష్టాలొచ్చినా - నేనానందింతున్
ఎన్ని శోధనలోచ్చినా - నేనారాధింతున్ ...
నింద వేదనలైనా - నేనానందింతున్
కరువు కాటకలైనా - నేనారాధింతున్ ||ప్రభు|| ||ఆనంద||
2. ప్రతి పరిస్థితులలో - నేనారాధింతున్
ప్రతి సమయమందూ - నేనానందింతున్
నా దాగుచోటు - యెహోవాయే
నా రక్షణ దుర్గం - ప్రభు క్రీస్తు యేసే ||ప్రభు||
No comments:
Post a Comment