Tuesday, December 2, 2025

                                                                    చేతులెత్తుచున్నాను 

పల్లవి: చేతులెత్తుచున్నాను - ప్రాణనాధుడా నీ 
       చెంతచేరియున్నాను 
       జీవనాధుడా - నా యేసునాధుడా

అ.ప. హల్లెలూయా - హల్లెలూయా (4)
      హల్లెలూయా నా యేసయ్యా (2)
      యేసయ్యా నా యేసయ్యా (2)

1. ఆకాశమందు - ఆసీనుడైనవాడా 
   నీ తట్టు నా - కన్నులెత్తుచున్నాను 
   యజమానుని చేతితట్టూ - దాసులు చూచునట్లు 
   నీవైపు నా కన్నులెత్తుచున్నాను 
   నన్ను కరుణించుమయ్యా       ॥చేతులెత్తు

2. సర్వజీవులను - పోషించుచున్నవాడా 
   నీవైపు నా కన్నులెత్తుచున్నాను 
   నా అండ కొండ కోట - నా ఆశ్రయ దుర్గమా 
   మౌనంగా ఉండక - నా మనవులు 
   ఆలకించుమా - నన్ను కరుణించుమయ్యా     ॥చేతులెత్తు 

No comments:

Post a Comment

Ascharya karyamulu song lyrics

2026 NEW YEAR SONG  ఆశ్చర్య కార్యములు - జరిగించువాడా!.. న్యూ  సాంగ్ పల్లవి: ఆశ్చర్య కార్యములు - జరిగించువాడా!.. అద్భుత దేవుడవు - నీవేనయ్యా!....