Tuesday, December 2, 2025

Vidheyeta Vijayamu lyrics

విధేయత- విజయం

పల్లవి: విధేయత- విజయం - వినయం - జీవం...
       అవిధేయత - అపజయం - మరణం శాపం 
      విధేయత - నా కియ్యుమా! 
      నీలాంటి మనస్సు - నా కియ్యుమా !
      నీవలె తగ్గింపు నా కొసగుమా!
      యేసయ్యా - యేసయ్యా - నా యేసయ్యా

    1.అబ్రహాము నీతికి - వారసుడనై
      మోషే బడిలో - బాలుడనై
      యోబు వంటి - శుద్ధతతో ...
      ఆలస్యం చేయక - వెనువెంటనే
     లోబడే జీవితం - నాకియ్యుమా...(2)      ॥యేసయ్యా॥

    2.గిద్యోను లోబడి - ఓడించెను...
      యెహోషువా ప్రార్థించి - జయమొందెను 
      దావీదులాంటి - సుబుద్ధితో 
      నోవాహు వంటి - నమ్మకంతో... (2) 
      సందేహము లేక - సమర్పణతో 
      సంపూర్ణ విధేయత - నాకియ్యుమా !       ॥యేసయ్యా॥

    3.అపోస్తలుల బోధకు - లోబడుదును
      పరవశించి పాడే - ఆత్మతో నింపు
      ఆగని హోరులో - ఆరని దీపముగా
      ప్రజ్వలింప జేయుము - నీ రాకకై
      మెలుకువలో ప్రార్థించే - కృపనియ్యుమా
      నీ రాకకై నన్ను - సిద్ధపరచుమా         ॥యేసయ్యా॥

No comments:

Post a Comment

Ascharya karyamulu song lyrics

2026 NEW YEAR SONG  ఆశ్చర్య కార్యములు - జరిగించువాడా!.. న్యూ  సాంగ్ పల్లవి: ఆశ్చర్య కార్యములు - జరిగించువాడా!.. అద్భుత దేవుడవు - నీవేనయ్యా!....