Tuesday, December 2, 2025

Junte Teena Daralu Kana Maduramainadi lyrics



పల్లవి: జుంటె తేనె ధారల కన్న మధురమైనది
       యేసు ప్రేమ - క్రీస్తు ప్రేమ
       యేసు ప్రేమ - దివ్య ప్రేమ - అభిషక్తుని ప్రేమ

1. ప్రేమించానని చెప్పినవారె విడిచిపోయారా
    నిను విడిచిపోయారా 
   కష్టాలలో కన్నీళ్ళలో కనుమరుగై పోయారా
    నిన్ను ఆదుకొనే దేవుడు - నీ చెంతనే ఉండగా  
   కలత చెందకుమా కలవర పడకుమా        ॥ జుంటె తేనె॥

2. కన్నబిడ్డలా ప్రేమా కలలా కరిగిపోయిందా
   నీడలా మిగిలిపోయిందా 
   బంధుమిత్రుల ప్రేమ ఆవిరై వెళ్ళిపోయిందా 
   శాశ్వతమైన ప్రేమతో నిను ప్రేమించెను యేసు 
   భయము చెందకుమా దిగులు పడకుమా     ॥జుంటె తేనె॥

3. భార్యభర్తల ప్రేమా మోడులా మిగిలిపోతుంది 
   పువ్వులా రాలిపోతుంది 
   స్నేహితులందరి ప్రేమ మధ్యలో ఆగిపోతుంది 
   ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకున్న 
   ప్రేమ కలత చెందకుమా కలవర పడకుమా   ॥జుంటె తేనె॥

No comments:

Post a Comment

Ascharya karyamulu song lyrics

2026 NEW YEAR SONG  ఆశ్చర్య కార్యములు - జరిగించువాడా!.. న్యూ  సాంగ్ పల్లవి: ఆశ్చర్య కార్యములు - జరిగించువాడా!.. అద్భుత దేవుడవు - నీవేనయ్యా!....