Friday, December 5, 2025

Krupa Maya Yeasaya song lyrics

కృపమయా యేసయ్యా


కృపమయా యేసయ్యా

నీ కృపా లేనిదే నే బ్రతుకలేనయ్యా

కృపమయా యేసయ్యా

నీ కృపా లేనిదే నే బ్రతుకలేనయ్యా

కృపా వెంబడి కృపతో నన్ను నింపుమా

కృపా వెంబడి కృపతో నన్ను నింపుమా

కృపమయా కృపమయా నా యేసయ్యా



ఆశ్చర్యమైన వెలుగులోకి

నన్ను పిలిచిన తేజోమయుడా

ఆశ్చర్యమైన వెలుగులోకి

నన్ను పిలిచిన తేజోమయుడా

ఆపద్బాంధవ ఆశ్రయపురమా

ఆపద్బాంధవ ఆశ్రయపురమా

ఆదరించే ఆరాధ్య దైవమా

ఆదరించే ఆరాధ్య దైవమా

ఆరాధన ఆరాధనా నీకే నా ఆలాపనా...

ఆరాధన ఆరాధనా నీకే నా ఆలాపన...



స్థూతులకు పాత్రుడా స్తోత్రించెద నిన్ను

మహిమకు యోగ్యుడా మహిమోన్నతుడా

స్థూతులకు పాత్రుడా స్తోత్రించెద నిన్ను

మహిమకు యోగ్యుడా మహిమోన్నతుడా

రాజాధి రాజా రవికోటి తేజ

రాజాధి రాజా రవికోటి తేజ

రాయమున రమ్ము రక్షించె దైవమా

రాయమున రమ్ము రక్షించె దైవమా

ఆరాధన ఆరాధనా నీకే నా ఆలాపనా...

ఆరాధన ఆరాధనా నీకే నా ఆలాపనా...

కృపమయా యేసయ్యా

నీ కృపా లేనిదే నే బ్రతుకలేనయ్యా

కృపమయా యేసయ్యా

నీ కృపా లేనిదే నే బ్రతుకలేనయ్యా

కృపా వెంబడి కృపతో నన్ను నింపుమా

కృపా వెంబడి కృపతో నన్ను నింపుమా

కృపమయా కృపమయా నా యేసయ్యా

Yatrikudanu Nenu Prabhuva song lyrics

యాత్రికుడను నేను ప్రభువా


పల్లవి: యాత్రికుడను నేను ప్రభువా - ఈ లోక మార్గమునా (2) 
       ఐగుప్తును విడచి కానాను పురమునకు నన్ను చేర్చుమా (2)॥యా॥

1. మార్గమున ఎన్ని కష్టములొచ్చిననూ - ఆహారం లేకుండినను (2) 
   మరుగైన మన్నాను - నాకిచ్చి నీవు
    తృప్తిపరచి - తోడై నడిపించుమా (2)  ॥యాత్రికుడ

2. నా జీవిత యాత్రలో నాయకుడవై నీవుండి - నన్ను నడిపించుమా (2) 
   నా చేయి విడువక - వెనువెంట వుండి 
   పరమ కానాన్ నన్ను చేర్చుమా (2)   "యాత్రికుడ

3. ఈ జీవిత పయనంలో పలుత్రోవలైనా- నేను భయపడను (2) 
   పగలు మేఘస్తంభమై - రాత్రి అగ్నిస్తంభమై 
   నాకు తోడై - నన్ను నడిపించుమా   "యాత్రికుడ॥

                                                                                                    - రచన, స్వరకల్పన: పాస్టర్ టి. కిష్టాఫర్

Yesayaku Asadyaminadi song lyrics

యేసయ్యకు అసాధ్యమైనది

పల్లవి: యేసయ్యకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 
       నా యేసయ్యా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? - హల్లెలూయ (4)

1. సర్వశరీరులకు దేవుడవు- సమస్తము నీకు సాధ్యమేనయ్యా
   ఎల్షర్దాయ్ అను నామము కలిగినవాడా 
   సకలము చేయగల శక్తిమంతుడా

2. మృతులను సహితము లేపినవాడు మరణపు ముల్లును విరిచినవాడు 
   అన్ని కాలంబులలో వున్నవాడు ఆశ్చర్యకరుడు నా యేసుడు

3. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి - సమస్తము సాధ్యమనేనుగా 
   సందేహము లేకుండా ప్రార్థించుము 
   నా యేసు మహిమను నీవు చూడుము ॥యేసు|


                                                                                                     - రచన, స్వరకల్పన: పాస్టర్ టి. క్రిప్టాఫర్

Rajula Raju Prabhuvula Prabhuvu song lyrics

రాజులరాజు ప్రభువుల ప్రభువు


పల్లవి: రాజులరాజు ప్రభువుల ప్రభువు రానైయున్నాడు 
       నా యేసు - రానైయున్నాడు

అ.ప. మహిమ స్వరూపుడై - తేజోమయుడై 
      మహిమ స్వరూపుడై - మేఘారూఢుడై

1. అల్పయు ఓమేఘయు - ఆది అంతము లేనివాడు 
   మహిమ స్వరూపుడై - తేజోమయుడై 
   రానైయున్నాడు - నా యేసు  ॥మహి॥

2. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు   ॥మహి॥
 
3. పదివేలలో - అతిసుందరుడు 
   అతికాంక్షనీయుడు - ఆరాధ్యదైవం ॥మహి॥

4. యేసుని నమ్మిన వధువు సంఘమును 
   కొనిపోవుటకై వచ్చుచున్నాడు  ॥మహి॥
\
                                                                      Raju- రచన, స్వరకల్పన: సిస్టర్ దయామణి క్రిప్టాఫర్


Vagdanamunichi song lyrics

 వాగ్ధానములనిచ్చి

పల్లవి: వాగ్ధానములనిచ్చి - నెరవేర్చు దేవుడవు
       వాత్సల్యత అనుదినము - చూపించువాడవు 
      మా మంచి యేసయ్యా మా స్తుతులకు పాత్రుడా 
      మా గొప్ప యేసయ్యా - మా ఆరాధనకు యోగ్యుడా 
      హల్లెలూయ.... హల్లెలూయ (4)

1. ఆకాశముల్ - భూమియు గతియించినను 
   నీ మాటలెన్నడూ గతించవు యేసయ్యా  ॥మా మంచి

2. నీ వాగ్ధానములు ఎన్నెన్ని యైనను
   నీయందు యేసయ్యా - అన్నియు నెరవేరును     ॥మా మంచి

3. క్రీస్తు రాయబారులమై నీ పక్షముగా మేము 
   సమాధాన సువార్తను ప్రకటించెదము యేసయ్యా ॥మా మంచి॥

                                                                                                - రచన, స్వరకల్పన: పాస్టర్ టి. క్రిష్టాఫర్

Yesaya Nii Sanidhi song lyrics

యేసయ్యా - నీ సన్నిధిని 

ఆరాధనా... ఆరాధనా...

పల్లవి: యేసయ్యా - నీ సన్నిధిని వెదకెదనంటిని 
      నీ సన్నిధిలో - నా హృదయం - పరవసించెనే...

1. నీ సన్నిధిలో - సంపూర్ణ సంతోషమున్నది... 
   నీ కుడిచేతిలో - నిత్య సుఖమున్నది (2) 
   నీ సన్నిధిలో - బలము ఉన్నది... నీ సన్నిధిలో - ధైర్యమున్నది (2) 
   ఆరాధనా... ఆరాధనా...      ॥యేసయ్యా॥

2. నీ సన్నిధిలో - అద్భుతములున్నవి... నీ సన్నిధిలో - సాక్ష్యమున్నది (2) 
   నీ సన్నిధిలో - ఘనత ఉన్నది... నీ సన్నిధిలో ప్రభావమున్నది (2)
   ఆరాధనా... ఆరాధనా...      ॥యేసయ్యా॥

3. నీ సన్నిధిలో - శాశ్వత కృప లభియించును 
   నీ సన్నిధిలో - ఆదరణ ఉన్నది... ఉన్నది...
   నీ సన్నిధిలో - అనందింతునూ... నీ సన్నిధిలో ఆరాధింతునూ   ॥యేసయ్యా॥

                                                                                                 - రచన, స్వరకల్పన: పాస్టర్ టి. క్రిష్టోఫర్

Yesaya Neva Pujaniyudavu lyrics

యేసయ్యా! నీవే పూజ్యనీయుడవు... 


పల్లవి: యేసయ్యా! నీవే పూజ్యనీయుడవు... 
       వేల్పులలో నీకు సాటెవ్వరును లేరు నీవే యోగ్యుడవు
        ఆ... హల్లెలూయ ఆ... హల్లెలూయ (2)

1. వేవేల దూతలతో పరిశుద్ధుడని - పొగడబడుచున్న దేవుడా 
   నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు (2) నీవే నా దేవుడవు - ఆ... ఆ... ఆ...

2. సర్వలోకంలో సద్భోదకుడా- సకలచర సృష్టికర్తవు 
   స్తుతి గానము నేను - చెల్లించెదనయ్యా ໖໓ ... ও... ও... ও...

3. ఆశ్చర్యకుడా ఆలోచనకర్తా- బలవంతుడైన దేవుడా 
   నిత్యుడగు తండ్రి - షాలేము రాజా

                                                                                                   -రచన, స్వరకల్పన: పాస్టర్ టి. క్రిష్టోఫర్

Tuesday, December 2, 2025

Vidheyeta Vijayamu lyrics

విధేయత- విజయం

పల్లవి: విధేయత- విజయం - వినయం - జీవం...
       అవిధేయత - అపజయం - మరణం శాపం 
      విధేయత - నా కియ్యుమా! 
      నీలాంటి మనస్సు - నా కియ్యుమా !
      నీవలె తగ్గింపు నా కొసగుమా!
      యేసయ్యా - యేసయ్యా - నా యేసయ్యా

    1.అబ్రహాము నీతికి - వారసుడనై
      మోషే బడిలో - బాలుడనై
      యోబు వంటి - శుద్ధతతో ...
      ఆలస్యం చేయక - వెనువెంటనే
     లోబడే జీవితం - నాకియ్యుమా...(2)      ॥యేసయ్యా॥

    2.గిద్యోను లోబడి - ఓడించెను...
      యెహోషువా ప్రార్థించి - జయమొందెను 
      దావీదులాంటి - సుబుద్ధితో 
      నోవాహు వంటి - నమ్మకంతో... (2) 
      సందేహము లేక - సమర్పణతో 
      సంపూర్ణ విధేయత - నాకియ్యుమా !       ॥యేసయ్యా॥

    3.అపోస్తలుల బోధకు - లోబడుదును
      పరవశించి పాడే - ఆత్మతో నింపు
      ఆగని హోరులో - ఆరని దీపముగా
      ప్రజ్వలింప జేయుము - నీ రాకకై
      మెలుకువలో ప్రార్థించే - కృపనియ్యుమా
      నీ రాకకై నన్ను - సిద్ధపరచుమా         ॥యేసయ్యా॥

Parishududina Prabhuva lyrics

పరిశుద్ధుడైన ప్రభువా

పల్లవి: పరిశుద్ధుడైన ప్రభువా నీ ఆత్మను కుమ్మరింపుమా! 
      యెరూషలేములోను - యూదయ సమరయందు 
      భూదిగంతముల వరకు నీకు సాక్షులమై ... .... (4)

1. ఆది అపొస్తులపై నీ ఆత్మను క్రుమ్మరింపగా 
   అగ్నిజ్వాలతో నింపబడి - అన్య భాషలతో మాటలాడిరి    ॥ప॥

2. సర్వజనుల మీదను నీ ఆత్మను
   రక్షి క్రమ్మరింపగా - వృద్ధులు కలలు కందురు 
   యౌవ్వనులు దర్శనము చూతురు  ॥పరిశుద్ధుడైన॥

3. కరుణా వాత్సల్యతను చూపించు దేవుడవు 
   అత్యంత కృపగలవాడవు
   శాంతి మూర్తివి నీవెనయ్యా   ॥పరిశుద్ధుడైన॥

Junte Teena Daralu Kana Maduramainadi lyrics



పల్లవి: జుంటె తేనె ధారల కన్న మధురమైనది
       యేసు ప్రేమ - క్రీస్తు ప్రేమ
       యేసు ప్రేమ - దివ్య ప్రేమ - అభిషక్తుని ప్రేమ

1. ప్రేమించానని చెప్పినవారె విడిచిపోయారా
    నిను విడిచిపోయారా 
   కష్టాలలో కన్నీళ్ళలో కనుమరుగై పోయారా
    నిన్ను ఆదుకొనే దేవుడు - నీ చెంతనే ఉండగా  
   కలత చెందకుమా కలవర పడకుమా        ॥ జుంటె తేనె॥

2. కన్నబిడ్డలా ప్రేమా కలలా కరిగిపోయిందా
   నీడలా మిగిలిపోయిందా 
   బంధుమిత్రుల ప్రేమ ఆవిరై వెళ్ళిపోయిందా 
   శాశ్వతమైన ప్రేమతో నిను ప్రేమించెను యేసు 
   భయము చెందకుమా దిగులు పడకుమా     ॥జుంటె తేనె॥

3. భార్యభర్తల ప్రేమా మోడులా మిగిలిపోతుంది 
   పువ్వులా రాలిపోతుంది 
   స్నేహితులందరి ప్రేమ మధ్యలో ఆగిపోతుంది 
   ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకున్న 
   ప్రేమ కలత చెందకుమా కలవర పడకుమా   ॥జుంటె తేనె॥

Anandame Anandame lyrics


 ఆనందమే ... ఆనందమే ... 

      యేసయ్యలో - నిత్య ఆనందమే...

అ.ప. ప్రభుయేసు నాతో ఉండగా భయమేల నా కిలలో ...
      ఆ..హల్లేలూయ...ఆ...హల్లెలూయా (3)

1. ఎన్ని కష్టాలొచ్చినా - నేనానందింతున్ 
   ఎన్ని శోధనలోచ్చినా - నేనారాధింతున్ ... 
   నింద వేదనలైనా - నేనానందింతున్ 
   కరువు కాటకలైనా - నేనారాధింతున్      ||ప్రభు||    ||ఆనంద||

2. ప్రతి పరిస్థితులలో - నేనారాధింతున్ 
   ప్రతి సమయమందూ - నేనానందింతున్ 
   నా దాగుచోటు - యెహోవాయే 
   నా రక్షణ దుర్గం - ప్రభు క్రీస్తు యేసే     ||ప్రభు||

Aradintunu Ni Namamu lyrics

 ఆరాధింతును - నీ నామమునూ


పల్లవి: ఆరాధింతును - నీ నామమునూ
      కీర్తింతునూ - నీ సన్నిధిలో .... (2)
      హల్లెలూయా - నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము

1. అల్ఫా - ఓమేగయై యున్నావు
   అందరిని రక్షించుచున్నావు (2) 
   రాజులకు రారాజుయై యున్నావు 
   అందరికి కాపరిగా యున్నారు   ॥యేసయ్యా॥

2. ఆశ్చర్యకార్యములు చేసావు
    అద్భుతాలెన్నెన్నో - చేసావు 
   సర్వశక్తిమంతుడవై యున్నావు 
   అందరికి ప్రభుడవై యున్నావు  ॥నీవే॥

Krupa Maya Yesayaa lyrics

 కృపామయా! ...యేసయ్యా 


పల్లవి: కృపామయా! ...యేసయ్యా 
      నీ కృపా లేనిదే ... నే బ్రతుకలేనయ్యా !...

అ.ప. కృప వెంబడి కృపతో ... నన్ను నింపుమా!... (2) 
      కృపామయా! కృపామయా... నా... యేసయ్యా (2)

1. ఆశ్చర్యమైన - వెలుగులోనికి
   నన్ను పిలిచిన - తేజోమయుడా !... (2)
   ఆపద బాంధవా - ఆశ్రయ పురమా !
   ఆదరించిన - ఆరాధ్య దైవమా !
   ఆరాధనా...ఆరాధనా...నీకేనా ఆలాపనా... ॥కృపామయా॥

2. స్తుతులకు పాత్రుడా ... స్తోత్రించెద నిన్ను...
   మహిమకు యోగ్యుడా!.. మహిమోన్నతుడా 
   రాజాధిరాజా ! రవికోటి తేజా ! 
   రయమున రమ్మూ! రక్షించే దైవమా !... 
   ఆరాధనా ...ఆరాధనా... నీకే నా ఆలాపనా...   ॥కృపా॥

                                                                    చేతులెత్తుచున్నాను 

పల్లవి: చేతులెత్తుచున్నాను - ప్రాణనాధుడా నీ 
       చెంతచేరియున్నాను 
       జీవనాధుడా - నా యేసునాధుడా

అ.ప. హల్లెలూయా - హల్లెలూయా (4)
      హల్లెలూయా నా యేసయ్యా (2)
      యేసయ్యా నా యేసయ్యా (2)

1. ఆకాశమందు - ఆసీనుడైనవాడా 
   నీ తట్టు నా - కన్నులెత్తుచున్నాను 
   యజమానుని చేతితట్టూ - దాసులు చూచునట్లు 
   నీవైపు నా కన్నులెత్తుచున్నాను 
   నన్ను కరుణించుమయ్యా       ॥చేతులెత్తు

2. సర్వజీవులను - పోషించుచున్నవాడా 
   నీవైపు నా కన్నులెత్తుచున్నాను 
   నా అండ కొండ కోట - నా ఆశ్రయ దుర్గమా 
   మౌనంగా ఉండక - నా మనవులు 
   ఆలకించుమా - నన్ను కరుణించుమయ్యా     ॥చేతులెత్తు 

Akashamandu Asinuayinvada lyrics

ఆకాశమందు ఆశీనుడైన


పల్లవి: ఆకాశమందు ఆశీనుడైన వాడా 
       నీ తట్టు నేను కన్నులెత్తుచున్నాను 
       నా కొండయు - కోటయు నీవే యేసయ్యా 
        నా ఆధారం ఆశ్రయం నీవే యేసయ్యా 
       నీ వుంటే చాలు కొదువ లేదయ్యా ఇబ్బందులు దొరికె రావయ్యా

1.ఆకాశ పక్షులను పోషించుచున్నావు 
  విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు
  అయినను వాటిని పోషించుచున్నావు   ॥ఆకాశమందు॥

2.పక్షుల కంటే శ్రేష్టులు మీరు 
  చింతయు బాధయు నీకు ఎందుకులే 
  సీయోను కొండ యేసయ్యా నీకుండా   ॥ఆకాశమందు॥

3. రేపటిని గూర్చి దిగులు పడకు 
   ఏనాటి కీడు ఆనాడే చాలునులే 
   నా అక్కరలు యేసయ్యా తీర్చునులే   "ఆకాశమందు||

Monday, December 1, 2025

SAPHALATHA SONG LYRICS

సఫలతా నీయుమా!

పల్లవి: సఫలతా నీయుమా!... సఫలము చేయుమా... 

       మాదు పనులన్నియు... మాదు కలలన్నియు 

       సఫలము చేయుమా... (2)


1. నడువనూ ... దుష్టుల ఆలోచన చొప్పున

    నిలువనూ ...పాపుల మార్గమందునా 

   కూర్చుండనూ ...అపహాసకులతో 

   నీ ధర్మశాస్త్రమును ....ఆనందముతో ధాన్యింతును    ॥సఫ॥


2. యోసేపూ!... ఐగుప్తు దేశమందునా 

   ఫలియించెను...నీటి యోరను చెట్టులా 

   ఆకువాడక తన కాలమందూ 

   ఫలియించు చెట్టువలె 

   అతడు చేయునదంతయూ ...    ॥సఫలము॥

 

Krupa Maya Yeasaya song lyrics

కృపమయా యేసయ్యా కృపమయా యేసయ్యా నీ కృపా లేనిదే నే బ్రతుకలేనయ్యా కృపమయా యేసయ్యా నీ కృపా లేనిదే నే బ్రతుకలేనయ్యా కృపా వెంబడి కృపతో నన్ను నింపుమా...